వెంక‌టేష్ కాంటే.. మాస్‌రాజా సై అన్నాడు!


వెంక‌టేష్ కాంటే.. మాస్‌రాజా సై అన్నాడు!
వెంక‌టేష్ కాంటే.. మాస్‌రాజా సై అన్నాడు!

ఏ క‌థ ఎప్పుడు ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళుతుందో ఏ కాంబినేష‌న్ ఎందుకు ఎలా సెట్ట‌వుతుందో సినీ ఇండ‌స్ట్రీలో చెప్ప‌డం క‌ష్టం. ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే కాంబినేష‌న్‌లు అప్పుడ‌ప్పుడు సెట్ట‌వుతుంటాయి. అలాంటి కాంబినేష‌నే ఒక‌టి త్వ‌ర‌లో సెట్ కాబోతోంది. సినిమా చూపిస్త‌మామా, నేను లోక‌ల్ వంటి చిత్రాల‌తో వ‌రు హిట్‌ల‌ని సొంతం చేసుకున్నారు త్రినాథ‌రావు న‌క్కిన‌. ఆయ‌న రామ్‌తో చేసిన `హలో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రం ఆశించిన విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

ఆ త‌రువాత సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ఓ ప‌వ‌ర్‌ఫల్ కాప్ స్టోరీని తెర‌పైకి తెర‌కెక్కించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు త్రినాథ‌రావు న‌క్కిన‌. వెంక‌టేష్ వేరే క‌థ‌ల‌పై ఇంట్రెస్ట్ పెట్ట‌డంతో ఆ ప్రాజెక్ట్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. చివ‌రికి సురేష్ బాబు వ‌రుస మార్పులు చెప్పంతో త్రినాథ‌రావు న‌క్కిన ఆ క‌థ‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ ద‌గ్గ‌రికి తీసుకెళ్లి వినిపించార‌ట‌. స్టోరీ, క్యారెక్ట‌ర్ కొత్త‌గా మాసీవ్‌గా వుండ‌టంతో ర‌వితేజ ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించ‌నున్నార‌ట‌. వివేక్ కూచీభోట్ల స‌హ‌నిర్మాత‌గా వ్య‌వహ‌రించ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది. `డిస్కోరాజా` త‌రువాత ర‌వితేజ `క్రాక్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న ఈ మూవీ య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోంది. దీనితో పాటు ర‌మష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని త‌రువాతే త్రినాథ‌రావు న‌క్కిన సినిమా వుంటుంద‌ని తెలిసింది.