అన్న పాట పాడితే సినిమా హిట్టే…


అన్న పాట పాడితే సినిమా హిట్టే...
అన్న పాట పాడితే సినిమా హిట్టే…

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా సినిమాలో మళ్ళీ ఆయన గొంతు సవరించుకుని పాట పాడేసారు. రవితేజ ఇలా సింగర్ గా మారటం ఇదే మొదటిసారి కాదు. గతంలో “బలుపు” సినిమాలో కాజల్ చెల్లివా.? కరీనాకు కజిన్ వా.? అనే పాటలో మొదట సాకీ ఆ తర్వాత లాస్ట్ పంచ్ లైన్స్ పాడారు. మళ్ళీ తమన్ రవి గారితో పవర్ సినిమాలో “నోతంకీ” అనే పాటను మొత్తం పాడించాడు. అసలే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అయిన రవితేజ ఆ పాటకి తెర ముందు, తెర వెనుక చెలరేగిపోయి ఆపాటను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు.

“రాజా దిగ్రేట్” సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మళ్ళీ రవితేజ గారిని “గున్నగున్న మామిడి” పాటను పాడించాడు. అసలే ఆపాట తెలంగాణా పార్టీ కల్చర్ లో ఒక సెన్సేషన్. సినిమాలో ఆ పాట వాడిన సందర్భం కూడా కరెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ డిస్కో రాజా సినిమాలో రవితేజ “జనం అందరూ జ్వరం తెచ్చుకుని, జడుస్తారు మన పేరు వింటే. ఇలాంటోడు ఈ ప్రపంచాన ఒకే ఒక్కడంతే” బేజారు అయిపోయి.. జేజేలు కొట్టాలి జనమంత మన ధాటికి.” అని రెట్రో పార్టీ సాంగ్ పాడేసాడు. ఇక ఈ సాంగ్ లో ఒక వెరైటీ లుక్ లో మనల్నిఆకర్షిస్తున్నాడు హాస్య కిరీటీ సునీల్. పాట రాసింది సాహిత్య శిఖరం సిరివెన్నెల గారు. ఇక ఈపాట ఇప్పటికే హిట్ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, మాస్ రాజా మళ్ళీ ఏడాదికి మినిమం మూడు రిలీజ్ లతో పాత రవితేజ మాదిరి బిజీ అయిపోవాలని కోరుకుందాం.