మీదీ కాంబినేషన్ కావాలని మాదీ ఆశపడుతోంది 

Raviteja Sunil successful combination
Raviteja Sunil successful combination

రవితేజ సునీల్ ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు ఎందుకంటే ఇద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించి, ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తూ ఎందరో ఔత్సాహిక కళాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు రవితేజ సునీల్ కాంబినేషన్ లో సీను ఉంది.! అంటే, అదేదో కొత్తగా డైలాగ్స్ క్రియేట్ చేసి సీను బిల్డ్ చేసి రాసినట్లు ఉండదు. కామెడీ టైమింగ్, డైలాగ్, డెలివరీ మాడ్యులేషన్, స్లాంగ్, డైలాగ్, కౌంటర్ డైలాగ్ పంచ్ ఇలా అన్ని కేటగిరీల్లో అసలు ఏమాత్రం ప్రిపరేషన్ అవసరం లేకుండా ఒకరి ఎదురు ఒకరిని కూర్చోబెడితే చాలు.. సీన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలావరకు డైలాగులు కూడా ఆన్ ది స్పాట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఏమో.? అనిపిస్తుంది.

వీళ్ళిద్దరూ కలిసి నటించిన “నా ఆటోగ్రాఫ్” సినిమాలో వాక్ మెన్ కామెడీ నుండి మొదలెడితే, సునీల్ హీరోగా నటించిన “మర్యాద రామన్న” సినిమాలో సైకిల్ కి రవితేజ డబ్బింగ్ చెప్పాడు. అదేవిధంగా రాంగోపాల్ వర్మ అప్పట్లో చేసిన ప్రయోగాత్మకమైన సినిమా “దొంగలముఠా” లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు ఇక వీరిద్దరి కాంబినేషన్ లో పీక్స్ అంటే ‘దుబాయ్ శీను” సినిమా. “శంభో శివ శంభో” సినిమా లో పరోటా నానిగా, “దొంగోడు” సినిమాలు బెయిల్ ఇప్పించి లాయర్ జస్టిస్ చౌదరి గా; బలాదూర్ సినిమాలో అనుష్క కి మందు తాగించే ఫ్రెండ్ గా, వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ చేసిన సెన్సేషనల్ మూవీ కృష్ణ సినిమాలో రవితేజ బెస్ట్ ఫ్రెండ్ గా, భద్ర సినిమాలో “బుల్లెబ్బాయి” గా డైరెక్టర్ హరీష్ శంకర్ సూపర్ హిట్ మూవీ మిరపకాయ సినిమా లో హీరోయిన్ మేనమామ చారుకేశ గా; రీసెంట్ గా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో కూడా రవితేజ సునీల్ కాంబినేషన్ సీన్లు ఇప్పటికీ ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి.

ఇప్పుడు మళ్లీ వెళ్లి ఇద్దరు కలిసి రవితేజ తాజా చిత్రం “డిస్కో రాజా” లో కలిసి నటిస్తున్నారు. ఇక డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సునీల్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. దుబాయ్ శీను సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ “దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా” అంటూ మొదలుపెట్టగానే మళ్లీ ఒకసారి అక్కడ ఉన్నఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోయారు. డిస్కో రాజా సినిమా హిట్ అయ్యి, జూలు విదిల్చిన సింహం లాగా సునీల్ మరొకసారి టాలీవుడ్ ని 2030 దాకా ఏలాలని కోరుకుందాం.