నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో!నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో!
నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో!

టాలీవుడ్ హీరోలు చాలా మంది సొంత నిర్మాణ సంస్థ‌ల్ని స్థాపించి ఔత్సాహిక యువ డైరెక్ట‌ర్‌ల‌ని ప్రోత్స‌హిస్తున్న విష‌యం తెలిసిందే. కొంత మంది స్టార్ డైరెక్ట‌ర్‌ల‌తో సినిమాలు నిర్మిస్తున్నారు కూడా. నంద‌మూరి బాల‌కృష్ణ, నాగార్జున‌, మోహ‌న్‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, క‌ల్యాణ్‌రామ్‌, మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, మంచు విష్ణు, మంచు మ‌నోజ్‌, ల‌క్ష్మీ మంచు, నాని, విశ్వ‌క్‌సేన్ లు నిర్మాత‌లుగా మారి సినిమాలు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఇదే జాబితాలోకి మ‌రో హీరో చేర‌బోతున్నారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. అంద‌రు హీరోల త‌ర‌హాలోనే సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించి కొత్త వారికి, టాలెంటెడ్ పీపుల్స్‌కి అవ‌కాశాలు ఇవ్వాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే నిర్మాణ సంస్థ పేరుని ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో హీరో ర‌వితేజ వున్న‌ట్టు తెలిసింది.

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్‌`. శృతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో టాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ లేడీ విల‌న్‌గా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ నిర‌వ‌ధికంగా ఆగిపోయింది. అన్నీ స‌వ్యంగా వుంటే మేలోనే ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది.