ప్లాప్ హీరోయిన్ తో ముందుకెళ్లాలని డిసైడైన మాస్ మహారాజా


ప్లాప్ హీరోయిన్ తో ముందుకెళ్లాలని డిసైడైన మాస్ మహారాజా
ప్లాప్ హీరోయిన్ తో ముందుకెళ్లాలని డిసైడైన మాస్ మహారాజా

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు రవితేజ. వరసగా నాలుగు డిజాస్టర్లు వచ్చినా కానీ ఎక్కడా సినిమాల విషయంలో దూకుడు తగ్గించట్లేదు. ఇప్పటికే క్రాక్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ, సమ్మర్ పూర్తయ్యేసరికి మరో సినిమాను మొదలుపెట్టనున్నాడు. తనతో వీర వంటి సినిమాను తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఒక చిత్రాన్ని చేయనున్నాడు. రమేష్ వర్మ ఇటీవలే రాక్షసుడు సినిమాతో మంచి హిట్ సాధించాడు. ఆ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణ రవితేజ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం గురించి రకరకాల కథనాలు షికార్లు చేస్తున్నాయి. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడన్నది అందులో ఒకటి. ఐతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక మరో రూమర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా మాళవిక శర్మను ఎంపిక చేశారట. ఈ భామ రవితేజతోనే నేల టికెట్ చిత్రంలో ఆడిపాడింది. అయితే ఆ సినిమా ఎంత పెద్ద ప్లాపయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రామ్ నటిస్తోన్న రెడ్ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన మాళవిక మరోసారి మాస్ రాజా సరసన మెరిసే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాను సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక క్రాక్ విషయానికొస్తే.. ఇందులో రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదలైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. రవితేజ నటించిన లాస్ట్ నాలుగు చిత్రాలు.. నేల టికెట్, అమర్ అక్బర్ అంథోని, టచ్ చేసి చూడు, డిస్కో రాజాలు డిజాస్టర్లుగా నిలిచాయి. మరి క్రాక్ చిత్రంతోనైనా రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.