రవితేజ కామెడీ ఎంటర్టైనర్ చిరు స్టైల్ లోనే


రవితేజ కామెడీ ఎంటర్టైనర్ చిరు స్టైల్ లోనే
రవితేజ కామెడీ ఎంటర్టైనర్ చిరు స్టైల్ లోనే

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది డిస్కో రాజాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు.

ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక రవితేజ కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. రవితేజ – త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో సినిమా కామెడీ ప్రధానంగా ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన కల్ట్ కామెడీ క్లాసిక్ చంటబ్బాయ్ తరహాలో సినిమా ఉంటుందని అంటున్నారు. మరి రవితేజ ఈ చిత్రంతోనైనా పూర్తి స్థాయిలో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. అసలే రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లో నటించింది లేదు.