రవితేజకు జోడీగా శృతి హాసన్ !!


Ravi teja and Shruti Haasan
Ravi teja and Shruti Haasan

శ్రీమంతుడు” వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసినా కూడా.. చేతిలో సినిమాల్లేక గత కొన్ని రోజులుగా కాళీగా ఉంటోంది స్టన్నింగ్ బ్యూటీ శృతిహాసన్. తండ్రి కమల్ హాసన్ తో శభాష్ నాయుడు అనే సినిమాను అప్పుడెప్పుడో స్టార్ట్ చేసింది ఈ అందాల సుందరి. అప్ కమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పుడు అడిగినా ఆ సినిమా గురించే చెప్పేది. ప్రస్తుతానికైతే ఓ తమిళ సినిమా, ఓ హిందీ సినిమా చేస్తోంది శృతిహాసన్. తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా రూపొందే ఓ భారీ చిత్రం కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలిసింది..ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారు.. !