ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేనిల `క్రాక్‌` టాకీ కంప్లీట్‌!

ర‌వితేజ - గోపీచంద్ మ‌లినేనిల `క్రాక్‌`టాకీ కంప్లీట్‌!
ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేనిల `క్రాక్‌`టాకీ కంప్లీట్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో డాన్ శీను, `బ‌లుపు` వంటి వ‌రుస హిట్లున్నాయి. ఈ రెండు సూప‌ర్ హిట్‌ల త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం `క్రాక్‌`. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. నెల్లూరులో జ‌రిగిన యార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. తాజాగా టాకీ పార్ట్‌ని పూర్తి చేసిన‌ట్టు చిత్ర బృందం తెలిపింది.  త్వ‌ర‌లో ర‌వితేజ‌, శృతిహాస‌న్‌ల‌పై ఓ పాట‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు. దీంతో ఈ మూవీ పూర్తి కానుంది.

క‌థ‌కు కీల‌కమైన పాత్ర‌లో శృఇహాస‌న్ క‌నిపించ‌నుంద‌ని చెబుతున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంద‌ని లేడీ విల‌న్‌గా ఆమె న‌ట‌న సినిమాకు హైలైట్గా నిలుస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తున్న ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోనుంద‌ట‌. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మెర్స‌ల్‌, బిగిల్ చిత్రాల‌కు ఛాయాగ్ర‌హ‌ణం అందించిన జి.కె. విష్ణు ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.