మాస్ మహారాజా మరో రీమేక్ చేస్తున్నాడా?


ravitejas next is a remake too
ravitejas next is a remake too

మాస్ మహారాజా రవితేజకు కెరీర్ లో ఎన్నో హిట్స్, ప్లాపులు ఉన్నాయి. రవితేజను ఎక్కువగా ఎంటర్టైనెర్స్ లో చూడటానికే జనాలు ఇష్టపడతారు. అదే ప్రయోగాత్మక చిత్రాలు, సీరియస్ సబ్జెక్టులు ఎంచుకుంటే మొహమాటం లేకుండా తిప్పికొడుతున్నారు. లేటెస్ట్ గా రవితేజ చేసిన డిస్కో రాజా ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఇది ప్రయోగాత్మకంగా తెరకెక్కినా రవితేజ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ సీరియస్ కథలు, ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకూడదని రవితేజ నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం రవితేజ చేస్తున్న క్రాక్ ఒక కాప్ డ్రామా. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. మొదటి నుండి ఈ చిత్రం ఒక తమిళ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే టీజర్ చూసాక అది నిజమేనని తేలింది. తమిళంలో సూపర్ హిట్ అయిన సేతుపతికి ఇది రీమేక్ అని తేలింది.

ఇక దీని తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. తనతో వీర చేసిన రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్ అయ్యాడు. రమేష్ వర్మ కెరీర్ లో సాధించిన ఏకైక హిట్ రాక్షసుడు. ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. అలాగే తన మొదటి చిత్రం రైడ్ యావరేజ్ గా ఆడింది. ఆ సినిమా ఒక కొరియన్ డ్రామా నుండి స్ఫూర్తి పొంది తీసిందే. ఈ నేపథ్యంలో రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో సూపర్ హిట్ అయిన సతురంగ వెట్టై చిత్రం  తెలుగులో బ్లఫ్ మాస్టర్ గా రీమేక్ ఐంది. అయితే ఆ సినిమాకు అరవింద్ స్వామి, త్రిష జంటగా సీక్వెల్ తెరకెక్కింది. చిత్రం పూర్తై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా ప్రివ్యూ చూసిన రమేష్ వర్మ ఇప్పుడు దాన్ని రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.