‘క’ సెంటిమెంట్ కే ఓటేస్తున్న రవితేజ


Ravitejas next title confirm
Ravitejas next title confirm

మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రస్తుతం బాగా స్లంప్ లో ఉన్న విషయం తెల్సిందే. రవితేజ నుండి వచ్చిన గత నాలుగు సినిమాలు కూడా దారుణమైన ఫ్లోప్స్ గా నిలిచాయి. తన లాస్ట్ సినిమా డిస్కో రాజా కూడా ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఎటూ కాకుండా పోయింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో ఉన్న రవితేజ క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగాసాగుతోంది. ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేయగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. రవితేజలో విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ పవర్ఫుల్ పోలీస్ పాత్ర ఇదే అని అంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ కథానాయికగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ చిత్రం పట్ల రవితేజ అండ్ కో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన కిక్ కూడా ఇదే తేదీన విడుదలైన నేపథ్యంలో మాస్ మహారాజా ఫ్యాన్స్ కిక్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. అలాగే రెండు చిత్రాల టైటిల్స్ కూడా ‘క’తోనే మొదలవ్వడంతో ఇక క్రాక్ సినిమా హిట్ అన్న భావనకు వచ్చేసారు.

ఇదిలా ఉంటే రవితేజ మరో సినిమాను కూడా కన్ఫర్మ్ చేసిన సంగతి తెల్సిందే. తనతో వీర సినిమా చేసిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా దానికి కూడా క సెంటిమెంట్ ప్రకారం టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి కిలాడీ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. రవితేజ బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ఈ టైటిల్ అయితే పెర్ఫెక్ట్ అన్న భావనకు వస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన రాక్షసుడు సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణ దీన్ని కూడా నిర్మించనున్నాడు. మరి ఈ క సెంటిమెంట్ రవితేజకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.