రాయలసీమ లవ్ స్టోరీ ట్రైలర్


Rayalaseema Love Story Trailer on 27 th August
Rayalaseema Love Story Trailer on 27 th August

రాయలసీమ నేపథ్యంలో ఎన్నో ఫ్యాక్షన్ చిత్రాలు వచ్చాయి , సంచలన విజయాలు సాధించాయి కానీ ఇప్పుడు రాయలసీమ నేపథ్యంలో లవ్ స్టోరీ వస్తోంది. రామ్ రణధీర్ అనే యువ దర్శకుడు ఈ రాయలసీమ లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టాడు. చిత్ర నిర్మాణం మొత్తం పూర్తిచేసుకుంది , సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఈనెల 27 న ట్రైలర్ ని సెప్టెంబర్ 20 న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పంచలింగాల బ్రదర్స్ కూడా రాయలసీమకు చెందినవాళ్లు కావడం విశేషం. వెంకట్ , హృశాలి , పావని హీరో హీరోయిన్ లు కాగా నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఇక ఈనెల 27 న రాయలసీమ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. రాయలసీమ ట్రైలర్ యాక్షన్ తో పాటుగా ఘాటు రొమాన్స్ కూడా ఫుల్లుగా ఉంది . యూత్ ని టార్గెట్ చేసిన దర్శకుడు రాయలసీమ లవ్ స్టోరీ విజయం పై ధీమాగా ఉన్నాడు.