‘పాయల్ రాజపుత్’ ఆనందం ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లోనే సరిపోతుంది


'పాయల్ రాజపుత్' ఆనందం ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లోనే సరిపోతుంది
‘పాయల్ రాజపుత్’ ఆనందం ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లోనే సరిపోతుంది

‘ఆర్.ఎక్స్ 100’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన పంజాబీ భామ ‘పాయల్ రాజపుత్’…. ఆ సినిమాలో చేసిన పాత్రకి మంచి గౌరవం, అవార్డులు దక్కాయి. మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఆమె రెండవ సినిమా ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ మాత్రం థియేటర్ లో జనాలు లేక అల్లాడిపోతోంది.

సినిమాని మొదటిరోజు, మొదటి ఆట చూసిన జనం చెప్పిన నిజమైన సమీక్ష ఏంటి అంటే సినిమా ఘోర పరాజయం అయ్యింది అని. అది మరి సినిమాలో పని చేసిన వారికి తెలిసిందో లేదో ఏమో కానీ….నటి పాయల్ రాజపుత్ మాత్రం సినిమా సక్సెస్ అయిందని తనలో తాను తెగ సంబరపడిపోతుంది. ఆమె సోషల్ మీడియా ఆక్టివిటీస్ అయిన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వాటిని చూస్తే, సినిమా గురించి తన అభిమానుల గురించి తెగ పోస్ట్స్ పెడుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది.

నిజానికి అలా చెయ్యడం వెనుక కారణం కొంత మంది ఆమె పిచ్చి అభిమానులు తనకి డైరెక్ట్ గా మెస్సేజ్ పంపడం….వాటిని మన రాజపుత్ పాయల్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేయడమే దీనికి కారణం అని తెలుస్తుంది. అవును కొంతమంది అభిమానులు ఆమెకి మెసేజెస్ పంపుతూ “మేడం మీ సినిమాని చూసాం, సినిమాలో మీ నటన బాగా ఉంది, సినిమాని నిలబెట్టిన వాటిలో మీ నటన, ఇంకా మీ అందం, అభినయం కూడా తోడు అయ్యాయి” అని అనేసరికి రాజపుత్ పాయల్ ఏమి ఆలోచించకుండా స్టేటస్ పెట్టేస్తుంది.

అవి చూసిన కొంతమంది జనాలు ఆమెకి ఎవరన్నా చెప్పండి! సినిమా బాలేదు అని…. “అలా మెస్సేజెస్ పంపుతున్న వారు కేవలం మీ సమయం వృధా చేయడానికి, లేదా బాలేని సినిమాని బాగుంది అని చెప్పి మీతో కావలని సరదాగా ఆటపట్టిస్తున్నారు” అని వాపోతున్నారు. జనాలు అంతగా మారిపోయారు అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలిచింది.