హీరోయిన్లతో ప్రయోగాలు చేపించాలి తప్ప అడ్డదిడ్డమైన గందరగోళం మరియు రొమాన్స్ చేయించకూడదు


హీరోయిన్లతో ప్రయోగాలు చేపించాలి తప్ప అడ్డదిడ్డమైన గందరగోళం మరియు  రొమాన్స్ చేయించకూడదు
హీరోయిన్లతో ప్రయోగాలు చేపించాలి తప్ప అడ్డదిడ్డమైన గందరగోళం మరియు రొమాన్స్ చేయించకూడదు

అసలే ఈ మధ్య సినిమాలలో హీరోయిన్లది కేవలం పాటల వరకు వచ్చే అతిధి పాత్రలు అని చెప్పుకుంటున్న జనాలు, అలా అనడం చూసి హీరోయిన్ ఎవరైనా ఏమనుకుంటారంటే ఆమ్మో మనం మంచి పాత్రలు ఎంచుకోవాలి మనకి జనాల దగ్గరనుండి మంచి పేరు రావాలి అని ప్రతి హీరోయిన్ అనుకుంటారు అందులో ఏ సందేహం లేదు.

మరి మొదటి సినిమా ద్వారానే మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఏమనుకుంటారంటే నేను చేసే ఏ పాత్ర అయినా జనాలు చూస్తారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి దర్శకులు ఏమనుకుంటారంటే అరె ఈ హీరోయిన్ బలే చేస్తుంది తినతో మనం ఒక సినిమా చేసి లైఫ్ ఇవ్వాలి అని అప్పటికప్పుడు కథ రాసేసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్లిపోయే ఏదోక మేజిక్ చేసి ఒప్పిస్తారు.

మరి ఆ హీరోయిన్- దర్శకులు ఎవరు అంటే ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ సినిమా హీరోయిన్ ‘పాయల్ రాజపుత్‘ మరియు దర్శకులు ‘భాను శంకర్ చౌదరి’ అని చెప్పవచ్చు…. ఈ రోజు ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా విడుదల అయ్యింది. విడుదలకి ముందు జనాలకి ఒక పసందైన ట్రైలర్ వదిలారు సినిమా ఇలా ఉండబోతుంది…. సినిమాలో హీరోయిన్ ది మంచి పాత్ర.. ఒక విజయశాంతి, ఒక సౌందర్య లాంటి కథానాయికల ఛాయలున్న పాయల్ రాజపుత్ అని దర్శకులు స్టేట్ మెంట్ ఇచ్చేసరికి ఎగపడి వెళ్లిపోయారు జనాలు.

మరి సినిమా చుసిన జనం హీరోయిన్ ని, డైరెక్టర్ ని తెగ తిట్టేస్తున్నారు… ఎందుకు అంటే సినిమా అంత చెత్తగా ఉంది కాబట్టి. పాయల్ రాజపుత్ గత సంవత్సరం ‘ఆర్.ఎక్స్ 100’ సినిమాలో చేసిన పాత్రకి ఈ ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాయల్ రాజపుత్ కూడా ఒకొక్క సినిమా కథని మంచిగా ఎంచుకుంటూ వస్తున్న ఆమెకి ఆర్.డి.ఎక్స్ లవ్ పెద్ద సవాల్ అయింది. అప్పటికి నెటిజన్లు ఆమెని ఎడాపెడా తిట్టసాగారు. అవన్నీ పట్టించుకోని పాయల్ ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా ప్రభావం మిగతా సినిమాల మీద పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలు.

ఇక దర్శకులు విషయానికి వస్తే మొదటి కన్నడ సినిమా అయిన ‘అర్ధనారీ’ ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి వదిలారు. ఇక ఆ సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. అందుకే నిర్మాత సి.కళ్యాణ్ గారు ఆర్.డి.ఎక్స్ లవ్ కథని నమ్మి దర్శకుడికి అవకాశం ఇచ్చారు. వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న సి.కళ్యాణ్ గారికి ఆర్.డి.ఎక్స్ లవ్ కూడా చేదు అనుభవం మిగిల్చింది. సినిమాలో హీరో అయిన తేజస్ కంచెర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నటన పరంగా కూడా చాలా పరిణితి చెందాలి.