ఆర్డీఎక్స్ లవ్ కు మహేష్ కు ఉన్న సంబంధమేంటి?


ఆర్డీఎక్స్ లవ్ కు మహేష్ కు ఉన్న సంబంధమేంటి?
ఆర్డీఎక్స్ లవ్ కు మహేష్ కు ఉన్న సంబంధమేంటి?

ఆర్ఎక్స్ 100తో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ చిత్రం ఆర్డీఎక్స్ లవ్. రేపు విడుదల కానున్న ఈ చిత్రం ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ముఖ్యంగా పాయల్ ను ప్రమోషన్ల కోసం బాగానే వాడుకున్నారు. మొదట టీజర్ పాయల్ గ్లామర్ ను వాడుకుని కట్ చేయడంతో అందరి దృష్టి పడింది.

అయితే ఈ చిత్రం మహేష్ సూపర్ హిట్ చిత్రం శ్రీమంతుడు కథను పోలి ఉంటుందిట. అక్కడ మహేష్ పోషించిన పాత్ర లానే ఇక్కడ పాయల్ పాత్ర కూడా ఉండబోతోందిట. శ్రీమంతుడు సినిమాలోలానే గ్రామాభివృద్ధి, మద్యపాన నిషేధం, అందరికీ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు వంటి అంశాల ప్రస్తావనతో ఉంటుందిట.

టీజర్ కట్ కేవలం అందరి దృష్టినీ ఆకర్షించడానికి తప్పితే సినిమా ఆద్యంతం సామాజిక అంశాల ప్రస్తావన ఉంటుందిట. పాయల్ గ్లామర్ కూడా ఒక పాట, కొన్ని సీన్లకే పరిమితమని తెలుస్తోంది. మరి ఈ లేడీ శ్రీమంతుడి కథ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి. తేజస్, పాయల్ పక్కన నటిస్తున్నాడు. మరి పాయల్ ఈ చిత్రాన్ని హిట్ చేయగలదేమో చూడాలి.