ఆర్డీఎక్స్ లవ్ : బూతే కాదు నీతి కూడా ఉంది


RDX Love Trailer
RDX Love Trailer

బోల్డ్ భామ పాయల్ రాజ్పుత్ నటించిన తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్ర టీజర్ సృష్టించిన సెన్సేషన్ అంతా  ఇంతా కాదు. శృంగారంతో మిళితమై ఉన్న డబల్ మీనింగ్ డైలాగులు కలిగిన సీన్లతో టీజర్ ను నింపేశారు. కొద్దిసేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. టీజర్ చూసిన ప్రేక్షకులు ఈసారి ఎటువంటి సంచలనాలు సృష్టిస్తారో అని చూస్తే నిరాశే కలిగింది.

సాధారణంగా టీజర్ కు కొనసాగింపుగా ట్రైలర్ కట్ ఉంటుంది. టీజర్ లో స్టోరీ గురించి హింట్ ఇస్తే, ట్రైలర్ లో బేసిక్ ప్లాట్ ఏంటనేది చెప్తారు. కానీ ఆర్డీఎక్స్ లవ్ టీజర్ ను రొమాన్స్ తో నింపేస్తే, ట్రైలర్ ను యాక్షన్ సీన్లు ఉండేలా కట్ చేసారు. పాయల్ రాజ్ పుత్ పంచ్ డైలాగులు చెబుతూ భారీ ఫైట్లు కూడా చేస్తోంది. అంటే ఇది కేవలం మసాలా సినిమానే కాదు ఇందులో ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేసారు నిర్మాతలు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈ చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తే సి కళ్యాణ్ నిర్మించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్డీఎక్స్ లవ్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.