ముక్కు పిండి మరీ డబ్బులు వసూల్ చేస్తోందట

Re shoot mode in Sharwanand , Sai pallavi padipadileche manasuసాయి పల్లవి హీరోయిన్ అంటే కాస్త ఘాటు ఎక్కువ అనే విషయం తెలిసిందే . ఎక్కడైనా బావ కానీ వంగ తోట కాడ బావ కాదు అన్నది సామెత ఆ సామెత ని బాగా వంట బట్టించుకున్నట్లుంది ముక్కు పిండి మరీ డబ్బులు వసూల్ చేస్తోంది సాయి పల్లవి . అసలు విషయం ఏంటంటే …… తాజాగా ఈ భామ శర్వానంద్ తో పడిపడి లేచే మనసు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో చిన్న చిన్న లోపాలు కనిపించాయట ! దాంతో రీ షూట్ చేస్తే బెటర్ అని భావించారు .

ఇదే విషయాన్నీ సాయి పల్లవి కి చెబితే బెటర్ మెంట్ కోసం మళ్ళీ షూటింగ్ చేయడం మంచిదే కానీ నేను ఫ్రీగా చేయను ఎందుకంటే నేను తీసుకున్న రెమ్యునరేషన్ కు నేను ఇచ్చిన డేట్స్ సరిపోయాయి కాబట్టి మళ్ళీ డబ్బులు ఇస్తేనే షూటింగ్ కి వస్తాను అని మొహమాటం లేకుండా చెప్పిందట . సాయి పల్లవి డిమాండ్ చేసినట్లుగా డబ్బులు ఇస్తూ ప్రస్తుతం రీ షూట్ చేస్తున్నారు . షూటింగ్ కంప్లీట్ చేసాక డిసెంబర్ 21 న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Re shoot mode in Sharwanand , Sai pallavi padipadileche manasu

Image result for padipadi leche manasu