ఈ నెలాఖరుకు “రియల్ దండుపాళ్యం” విడుదల


real dandupalyam movie get release date

శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకం పై మేఘన రాజ్,రాగీణి త్రీవేది,దీప్తి,సంయుక్త వర్నాడ్ హీరోయిన్లు గా రూపొందిన చిత్రం “రియల్ దండుపాళ్యం”.ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ” A ” సర్టిఫికెట్ పొందింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.పుట్టు స్వామి మాట్లాడుతూ ఇదొక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కినది.ఈ చిత్రంలో హీరోయిన్ల యాక్షన్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని ” A ” సర్టిఫికెట్ పొందింది. ఈ నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయునున్నాం అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: భారతి బాబు,సంగీతం:శ్రీధర్.వీ.సంబ్రమ్,కెమెరా:నాగేష్ .వీ.ఆచార్య ప్రొడ్యూసర్: సి.పుట్టు స్వామి,కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: మహేష్.