ఆపద్భాంధవుడు కాదంబరి కిరణ్


Real hero Kadambari kiran

జర్నలిస్ట్ గా , నటుడిగా , దర్శకుడిగా , నిర్మాతగా , సామాజిక సేవా కార్యకర్తగా  విశిష్ట సేవలందిస్తున్న  బహుముఖ ప్రజ్ఞాశాలి కాదంబరి కిరణ్ . మనం సైతం అనే సేవా సంస్థ ని స్థాపించి సాయం కోసం ఎదురు చూసే వాళ్లకు తక్షణ సహాయం , సత్వర సహాయం అందిస్తున్న నిత్య శ్రామికుడు కాదంబరి కిరణ్ . సినిమా రంగంలోని అసంఘటిత కార్మికుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ వాళ్ళ కష్టాలలో తలమునకలౌతున్న ధన్యజీవి కాదంబరి .

 

ఇప్పటివరకు అడిగిన వాళ్లకు లేదనకుండా , కాదనకుండా సహాయం చేస్తూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నాడు . తన దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారం కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడని బోళాతనం కాదంబరి సొంతం . తాజాగా సహాయం కోసం వచ్చిన ఇద్దరికీ 40 వేల చొప్పున , 20 వేల చొప్పున మనం సైతం నుండి  ఆర్ధిక సహాయం అందించి మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు కాదంబరి . నిరంతరం సేవా కార్యక్రమాలతో సహజీవనం చేస్తున్న కాదంబరి ఆప్తుడిగా , ఆపద్భాంధవుడిగా పేరుగాంచాడు .

English Title : Real hero Kadambari kiran