రియల్ హీరో అంటే సూర్యా నే


real hero suriya sensational decisionతమిళ స్టార్ హీరో సూర్య తానూ రీల్ హీరో ని మాత్రమే కాదు రియల్ హీరో నని ఇప్పటికే పలు సంఘటనల ద్వారా నిరూపించుకున్న విషయం తెలిసిందే . తాజాగా మరో సంచలనాత్మక సంఘటనతో మిగతా హీరోలకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాడు . ఇంతకీ సూర్య చేసిన పనేంటో తెలుసా ……… తన దగ్గర పనిచేసే స్టాఫ్ ని షూటింగ్ సమయంలో నిర్మాతల నుండి డబ్బులు తీసుకోకుండా తానే ఆ ఖర్చులన్నీ భరించేలా నిర్ణయం తీసుకోవడమే !

ఒక సినిమాకు తన దగ్గర పనిచేస్తున్న వాళ్లకు కనీసం 25 లక్షల నుండి 35 లక్షల వరకు జీత భత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది అది ఇన్నాళ్లు నిర్మాతల మీద ఆ భారం పడేది దాంతో నిర్మాతకు ఇబ్బందులు అయ్యేవి కానీ ఇన్నాళ్లు అది హీరో సూర్య ద్రుష్టి కి రాలేదట ! ఇటీవల పలు చిత్రాలను సూర్య నిర్మించిన విషయం తెలిసిందే అప్పుడు ఈ ఖర్చుల గురించి తెలిసిందట ! అంతే వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు . ఎందుకంటే నిర్మాత నుండి కోట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్లకు లక్షల్లో జీతాలు ఇచ్చుకోలేరా ? అది కూడా నిర్మాతే భరించాలా ? అని భావించి తన వాళ్లకు తానే జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు . దాంతో అన్నయ్య ని ఫాలో అవుతున్నాడు తమ్ముడు కార్తీ . అంతేనా సంచలనాలకు కేంద్ర బిందువైన విశాల్ కూడా ఇదే ఫాలో అవుతున్నాడట దాంతో మిగతా హీరోలకు గుబులు పట్టుకుంది .