బన్నీ బాలీవుడ్ లో ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్లు?


Reason behind Allu Arjuns idea of interviews to bollywood media
Reason behind Allu Arjuns idea of interviews to bollywood media

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి భారీ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది ఈ చిత్రం. ఈ నెల ఆరున అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. ఈ ఈవెంట్ కు తెలుగు మీడియాతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ మీడియాలకు కూడా ఆహ్వానం అందింది. దాంతోపాటే ఈవెంట్ ముగిశాక అల్లు అర్జున్ కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది.

అయితే అల వైకుంఠపురములో హిందీలో విడుదల కావట్లేదు. తమిళ వెర్షన్ రిలీజ్ కూడా లేదు. మరి ఎందుకని ఆయా భాష జర్నలిస్ట్ లను పిలిచి బన్నీ ఇలా ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లు? దేని గురించి ఇదంతా అనే సందేహం చాలా మందికి కలిగింది. దానికి సమాధానంగా మరో వార్త వినిపిస్తోంది.

బన్నీ చాలా కాలం నుండి ప్యాన్ ఇండియా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. కనీసం తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం చేయాలని కూడా చూసాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు – తమిళ భాషా చిత్రానికి అంతా ఓకే అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ప్రభాస్, యష్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా మార్కెట్ తెచ్చుకోవడంతో బన్నీ కూడా ఆ మార్కెట్ పై కన్నేశాడు కానీ సరైన ప్రాజెక్ట్ వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడు అల వైకుంఠపురములో ముగిశాక సుకుమార్ తో సినిమాను బన్నీ చేయబోతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోకి డబ్ చేయించాలని అనుకుంటున్నాడు. అలాగే సుకుమార్ సినిమా పూర్తయ్యాక మురుగదాస్ తో సినిమాను కన్ఫర్మ్ చేసాడు. దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో తీయాలన్న ప్లాన్స్ ఉన్నాయి. ఆ రెండు సినిమాల ఫలితాలను బట్టి బన్నీ ప్యాన్ ఇండియా ఫ్యూచర్ ప్లాన్స్ ఆధారపడి ఉంటాయి. అప్పటికప్పుడు తన సినిమాలను ఆ భాషల్లో ప్రమోట్ చేయడం కన్నా ముందుగా అక్కడి మీడియా వారికి చేరువ కావడం బెటర్ అని ఫీల్ అయ్యాడని తెలుస్తోంది. అందుకే అల వైకుంఠపురములో చిత్ర విశేషాలను చెబుతూ హిందీ, తమిళ మీడియా జనాలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదీ సంగతి.