బోయపాటి ప్రాజెక్ట్ ఆలస్యం వెనుక కారణాలివే


Boyapati Srinu
బోయపాటి ప్రాజెక్ట్ ఆలస్యం వెనుక కారణాలివే

మాస్ చిత్రాల దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించేలా సినిమాలు తీయాలంటే అది కచ్చితంగా బోయపాటి వల్లే అవుతుందని ఒక పేరుంది. అయితే బోయపాటి శ్రీనుపై ఒక ప్రధాన కంప్లైంట్ కూడా ఉంది. అదే అవసరానికి మించి ఖర్చు పెట్టించడం. బడ్జెట్ విషయంలో బోయపాటి ఎప్పుడూ పరిమితి దాటి ఖర్చుపెట్టిస్తాడు. అయితే ఔట్పుట్ సింహా, లెజెండ్, సరైనోడు తరహాలో ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే దమ్ము, వినయ విధేయ రామ తరహాలో ఉంటేనే వస్తుంది ఇబ్బందంతా.

వినయ విధేయ రామ వీర డిజాస్టర్ తర్వాత బోయపాటి శ్రీనుకి మరో సినిమా ఓకే చేయించుకోవడానికి దాదాపు 10 నెలల సమయం పట్టింది. బాలకృష్ణతో సినిమా ఉంటుందని ముందు నుండి చెబుతున్నా బడ్జెట్ కారణాల వల్ల ఓకే కాలేదు. బాలయ్యతో సినిమాకి 40 కోట్లు చెప్పాడు బోయపాటి. అప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తో తలబొప్పి కట్టి ఉన్న బాలయ్య కేఎస్ రవికుమార్ తో సినిమా కమిట్ అయ్యాడు. అయితే ఇన్నాళ్ళకి మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రావడంతో బాలయ్య – బోయపాటి చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. అదీ విషయం.