బంగార్రాజు మొదలుకాకపోవడానికి అసలు కారణం ఇదే..


Nagarjuna
బంగార్రాజు మొదలుకాకపోవడానికి అసలు కారణం ఇదే..

ఇటీవలే కాలంలో నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ అంటే సోగ్గాడే చిన్ని నాయన గురించి చెప్పుకోవచ్చు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. అప్పటినుండే ఈ సినిమాకు ప్రీక్వెల్ చేయాలని నాగార్జున భావించాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మృతి చెందడం, నాగార్జున బిగ్ బాస్ తో బిజీగా మారడం వంటి కారణాల వల్ల షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అయితే అక్టోబర్ లో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనలో అలరించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో కూడా నాగ్ సరసన కనిపించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.