పోయి పోయి మెగాస్టార్ తో ఎందుకు?


పోయి పోయి మెగాస్టార్ తో ఎందుకు?
పోయి పోయి మెగాస్టార్ తో ఎందుకు?

గోపీచంద్ కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. గత కొన్నేళ్లుగా తన సినిమాలు అన్నీ వచ్చినవే వచ్చినట్లు ప్లాప్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ చేసాడు గోపీచంద్. దాని పేరు చాణక్య. టైటిల్ వినగానే ఇదేదో మైండ్ గేమ్ అనిపిస్తోంది. టీజర్ కూడా ఆకట్టుకుంది. తిరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న గోపీచంద్ మార్కెట్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఇలాంటి పరిస్థితులలో గోపీచంద్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు. చాణక్య చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సైరాకు పోటీగా నిలబెడుతున్నాడు. సైరా అక్టోబర్ 2న వస్తుండగా, చాణక్య అక్టోబర్ 5న రావడం అంత మంచిది కాదేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సైరాకు నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది. అయితే దసరా సెలవులు కావడంతో మరో సినిమాకు కూడా స్పేస్ ఉంటుందని చాణక్య టీమ్ భావించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ చాణక్యకు ఇంత పోటీలో కూడా మంచి టాక్ వచ్చిందంటే గోపీచంద్ మళ్ళీ ట్రాక్ లో పడటం ఖాయం.