కొరటాల శివ దేవిని వదులుకోవడానికి గల కారణమేంటి?


కొరటాల శివ దేవిని వదులుకోవడానికి గల కారణమేంటి?
కొరటాల శివ దేవిని వదులుకోవడానికి గల కారణమేంటి?

దేవి శ్రీ ప్రసాద్ ను ఈ మధ్య అందరూ పక్కన పెట్టేస్తున్నారు అన్నది పాత వార్తే. దీనికి ఎవరికి వారికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తిగత విబేధాల వల్ల దూరంగా ఉందామని నిర్ణయించుకుంటే, మరికొంత మంది కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదని భావించి దూరంగా ఉంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ది మొదటి రకం. అ..ఆ సమయంలోనే ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో కొన్ని అద్భుతమైన పాటలు వచ్చాయి. అయితే అభిప్రాయ బేధాల తర్వాత మిక్కీ జె మేయర్, అనిరుధ్ తో కలిసి పనిచేసిన త్రివిక్రమ్ చివరికి థమన్ దగ్గర ఆగాడు. ఇక కిషోర్ తిరుమల వంటి దర్శకులైతే విబేధాలు ఏం లేవు. కాంబోకు బ్రేక్ ఇద్దామన్న ఉద్దేశంతో రామ్ తో తీస్తున్న రెడ్ కు మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడు.

ఇదంతా బానే ఉంది కానీ కొరటాల శివ ఎందుకు దూరం పెట్టాడో ఎవరికీ అర్ధం కాలేదు. మొదటి నుండి కొరటాల శివ దేవితోనే పనిచేసాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని సినిమాలకీ దేవినే సంగీత దర్శకుడు. ఈ సినిమాల విజయంలో దేవి పాత్రను విడదీసి చూడలేం. అంత సూపర్ హిట్ కాంబోను ఎందుకు కొరటాల కాదనుకున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత అభిప్రాయాలు లాంటివేం లేవట. ఒక రెండు సినిమాలకు గ్యాప్ ఇస్తే మంచిదని కొరటాల శివ భావించాడట. అందుకే దేవి తప్ప ఏ సంగీత దర్శకుడైనా ఓకే అనుకుంటున్న సమయంలో మణిశర్మ పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్యే ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన మణిశర్మ, ఈ తరానికి నచ్చేలా కూడా సంగీతాన్ని ఇవ్వగలడని నిరూపించుకున్నాడు. పైగా మణిశర్మ – చిరంజీవి కాంబో ఎవర్ గ్రీన్. అందుకే మరో ఆలోచన లేకుండా మణిశర్మను కన్ఫర్మ్ చేసేసాడు కొరటాల శివ. కేవలం వరసగా ఒకరితో పనిచేస్తే వర్క్ రొటీన్ అవుతుందేమోనన్న భయంతోనే కొరటాల శివ దేవిని దూరం పెట్టాడు కానీ మరో ఆలోచన లేదని సమాచారం.