ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు గొడవలా


reason behind ntr absence naa nuvve audio eventఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే ఆడియో వేడుక జరిగింది అయితే ఆ వేడుకకు తమ్ముడు ఎన్టీఆర్ హాజరుకాలేదు దాంతో ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు విబేధాలు వచ్చాయని అందుకే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సినిమా వేడుకకు రాలేదని పుకార్లు షికారు చేసాయి . గతంలో కూడా ఎలాంటి రకమైన పుకార్లు వచ్చాయి అయితే అవన్నీ రూమర్లు మాత్రమే అని స్పష్టం చేసారు ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ లు .

తాజాగా ఎన్టీఆర్ రాకపోవడంతో మళ్ళీ ఇద్దరికీ పొసగడం లేదని గుసగుసలు మొదలయ్యాయి . ఈ వార్తలు మరీ ఎక్కువ కాకముందే వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన ఎన్టీఆర్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది . విశాఖపట్టణం లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొనడానికి ఎన్టీఆర్ వెళ్ళాడట దాంతో కళ్యాణ్ రామ్ సినిమా వేడుకకు హాజరు కాలేక పోయాడని చెబుతున్నారు . అంటే ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు మధ్య గొడవలు లేవన్నమాట . కళ్యాణ్ రామ్ నటించిన ” నా నువ్వే ” చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు .