ఎంతైనా ప్రభాస్ స్ట్రాటజీని మెచ్చుకోవాల్సిందే


ఎంతైనా ప్రభాస్ స్ట్రాటజీని మెచ్చుకోవాల్సిందే
ఎంతైనా ప్రభాస్ స్ట్రాటజీని మెచ్చుకోవాల్సిందే

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఆకాశమంత ఇమేజ్ సంపాదించాడు. నేషన్ వైడ్ గా ఆ మాటకొస్తే అంతర్జాతీయ లెవెల్లో కూడా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత యాక్షన్ మూవీ సాహో రూపంలో చేసి సేఫ్ ప్లే ఆడదామనుకున్నాడు ప్రభాస్. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు ప్రభాస్ ఒక ప్రేమకథను చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ భిన్నమైన స్ట్రాటజీని అవలంబిస్తున్న సంగతి ఇట్టే అర్ధమైపోతుంది.

రెబెల్ స్టార్ కోరితే అతనితో సినిమా చేయడానికి ఏ స్టార్ దర్శకుడూ కూడా వెనుకాడడు. కానీ ప్రభాస్ మాత్రం ఎందుకనో పెద్దగా అనుభవం లేని దర్శకులతోనే జట్టు కడుతున్నాడు. సాహోకు సుజీత్ చేసింది ఒక్క సినిమానే. ఇప్పుడు రాధే శ్యామ్ కు ముందు రాధా కృష్ణ కుమార్ చేసింది కూడా ఒక్క సినిమానే. ఇది ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమా. దీని తర్వాతి చిత్రంపై నిన్ననే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

ప్రభాస్ 21వ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నాడు. బాహుబలికి అపారమయిన మాస్ ఇమేజ్ ఉంది. నాగ్ అశ్విన్ క్లాస్ డైరెక్టర్. అతని సినిమాల్లో బలమైన కథ ఉంటుంది కానీ హీరోయిజం ఎలివేట్ చేయడాలూ, కమర్షియల్ హంగుల కోసం ప్రాకులాడడాలు ఉండవు. మరి ప్రభాస్ ఇలాంటి దర్శకుడితో ముందుకు వెళ్ళడానికి కారణమేంటి?

ఏ నటుడికైనా ఎంత పెద్ద ఇమేజ్ వచ్చినా కేవలం హీరోయిజం పండించి సినిమాలు చేసేస్తానంటే కుదరదు. టైమ్ టు టైమ్ తనను నటుడిగా నిరూపించుకోవాలి. నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడి చేతిలో పడితే కచ్చితంగా ప్రభాస్ పెర్ఫార్మన్స్ గురించే మాట్లాడుకుంటారు. తన స్టార్ పవర్ గురించి కాకుండా పెర్ఫార్మర్ గా తనను గుర్తిస్తే అంతకంటే మన రెబెల్ స్టార్ కు కావాల్సింది ఏముంది. నటుడికి లాంగ్ రన్ తీసుకొచ్చేవి ఇవే. అందుకే ప్రభాస్ కమర్షియల్ లెక్కలను పక్కనపెట్టి ఒక బలమైన కథతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాడు. మరి నాగ్ అశ్విన్ – ప్రభాస్ వంటి భిన్నమైన కలయిక ఎలాంటి అద్భుతాలను చేస్తుందో చూడాలి.