అరవింద సమేత సీడెడ్ హక్కులకు భారీ ఆఫర్


Record price for Ntrs Aravinda sametha ceeded rights యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది . ఈ చిత్రానికి దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం ఒక కారణమైతే వరుసగా ఎన్టీఆర్ సాధిస్తున్న విజయాలు మరో కారణం దాంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది . దాంతో ఏరియాల వారీగా బయ్యర్లు పోటీ పడుతున్నారు . ఇక తాజాగా ఈ సినిమాని సొంతం చేసుకోవడానికి సీడెడ్ లో తీవ్ర పోటీ నెలకొనగా 15 కోట్లకు రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది . రాయలసీమలో ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది , అలాగే ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రం కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కాబట్టి ఈ చిత్రానికి 15 కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది .

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో ఈషా రెబ్బా , జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు . ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్ , అరవింద టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది . దసరా పండగ సందర్బంగా అక్టోబర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఒక్క సీడెడ్ లోనే 15 కోట్లకు అమ్ముడుపోతే అన్ని హక్కులు కలుపుకొని వంద కోట్ల ని చేరేలా ఉంది అరవింద సమేత వీర రాఘవ చిత్రం బిజినెస్ .

English Title: record price for ntrs aravinda sametha ceeded rights