యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న వరుణ్ సినిమా


Tholiprema hindi Dubbing Movie
Tholiprema hindi Dubbing Movie

మెగా హీరో వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ చిత్రం యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది . కేవలం ఒక్క రోజులోనే 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది . తొలిప్రేమ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెట్టడంతో అది ఫ్రెష్ లవ్ స్టోరీ కావడంతో యూత్ కి బాగా నచ్చుతోంది అందుకే అలా పెట్టారో లేదో ఇలా ఎగబాకేసింది వ్యూస్ పరంగా . ఒక్కరోజులోనే 10 మిలియన్ ని టచ్ చేసిందంటే రాబోయే రోజుల్లో అవలీలగా 200 మిలియన్ వ్యూస్ సాధించడం ఖాయమని అంటున్నారు .

వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా కున్న మరో విశేషం ఏంటంటే ఎస్ ఎస్ తమన్ సంగీతం . తమన్ పాటలు అన్నీ మూస ధోరణిలో ఉంటున్నాయని ఫీల్ అవుతున్న సమయంలో అద్భుతమైన సాంగ్స్ అందించాడు . ఆ పాటలు యువతని విపరీతంగా అలరిస్తున్నాయి మరి .