`దిశ‌`ని ఆప‌కుంటే వ‌ర్మ‌పై భౌతిక దాడి త‌ప్ప‌దా?


`దిశ‌`ని ఆప‌కుంటే వ‌ర్మ‌పై భౌతిక దాడి త‌ప్ప‌దా?
`దిశ‌`ని ఆప‌కుంటే వ‌ర్మ‌పై భౌతిక దాడి త‌ప్ప‌దా?

ఎవ‌రు ఎలా పోతే నాకేటి సిగ్గు అన్న‌ది వ‌ర్మ సిద్ధాంతం. ఎక్క‌డ ఎవ‌రు ఎలా పోయినా అది సంచ‌ల‌నం అయితే చాలా దాన్నే త‌న సినిమాకు క‌థా వ‌స్తువుగా చేసుకుని సినిమా చేయ‌డానికి వ‌ర్మ ముందు వ‌రుస‌లో నిలుస్తుంటాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్ శివారులో జ‌రిగిన దిశ సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌భుత్వాల‌పై ముఖ్యంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వినిపించాయి.

అమాయ‌కురాలైన ఓ యువ‌తిని మాన‌వ మృగాలు అత్యంత పాశ‌వికంగా మాన‌భంగం చేయ‌డ‌మే కాకుండా అత్యంత కిరాత‌కంగా ప్రాణం వుండానే పెట్రోల్ పోసి హ‌త్య చేశారు. ఆ త‌రువాత దేశ వ్యాప్తంగా విమ‌ర్‌శ‌లు త‌లెత్త‌డంతో వారిని ఎన్ కౌంట‌ర్‌లో లేపేశారు. ఇదే అంశాన్ని తీసుకుని వ‌ర్మ `దిశ ఎన్ కౌంట‌ర్‌` పేరుతో గంట‌న్న‌ర సినిమాని రూపొందిస్తున్నాడు.

దీనిపై దిశ తండ్రి ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ కోర్టుని ఆశ్ర‌యించారు. అయినా వ‌ర్మ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఇష్యూ ఆల్ ఇండియా రెడ్డి జాక్‌కి వెళ్లింది. దీంతో విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న రెడ్డి జాక్ వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చారు. వెంట‌నే ఈ చిత్రాన్ని నిలిపివేయాల‌ని, లేదంటే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌న‌ని తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రిస్తున్నారు.

సెన్సార్ వారిని క‌లిసి ఈ చిత్రాన్ని నిలిపివేయాల‌ని విన‌ప‌తి ప‌త్రాన్ని ఇచ్చారు. దీనికి కూడా వ‌ర్మ వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే వ‌ర్మ‌పై భౌతిక దాడుల‌కు కూడా వెన‌కాడ‌బోమ‌ని రెడ్డి జాక్ చెప్ప‌డంతో ప్ర‌స్తుతం `దిశ ఎన్ కౌంట‌ర్‌` సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇదంతా వ‌ర్మ చేస్తున్న ప‌బ్లిసిటీ స్టంట్ అని కొంత మంది కొట్టి పారేస్తుంటే ఈ సారి వ‌ర్మ‌కు గ‌ట్టి గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని కొంత మంది అంటున్నారు.