హిట్ సినిమాని మిస్ చేసుకున్నందుకు బాధపడుతోంది


reethu varma felt very sad for missing chance

పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయం అందుకున్న భామ రీతూ వర్మ కాగా ఈ భామ తాజాగా హిట్ టాక్ తెచ్చుకున్న గూఢచారి సినిమాని మిస్ చేసుకున్నందుకు బాధపడుతొంది . అసలు గూఢచారి సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నే ఎంచుకున్నారు . ప్రారంభోత్సవ సమయంలో ఉంది కూడా కానీ ఎక్కడో తేడా కొట్టింది లేకపోతే అడవి శేష్ ని లైట్ గా తీసుకొని ఉంటుంది దాంతో గూఢచారి సినిమా చేయడానికి నిరాకరించింది . దాంతో రీతూ వర్మ స్థానంలో శోభిత దూళిపాళ్ల ని తీసుకున్నారు ఇంకేముంది ఆ భామ రెచ్చిపోయి లిప్ లాక్ ఇచ్చి మరీ హిట్ కొట్టింది .

ఆగస్టు 3న విడుదలైన గూఢచారి చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ రాగా వసూళ్లు కూడా మెల్లిగా పెరుగుతున్నాయి . బాండ్ సినిమాలు కోరుకునే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతోంది . రీతూ వర్మ ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు ఇపుడు బాధపడుతోంది ఎందుకంటే సినిమా హిట్ అయ్యింది కదా అందుకు . గూఢచారి ని లైట్ గా తీసుకొని తప్పు చేసి హిట్ ని మిస్ చేసుకుంది రీతూ వర్మ . అయితే ఇంతటి హిట్ ని మిస్ చేసుకొని మరో మంచి ప్రాజెక్ట్ చేసిందా అంటే లేదు . అయినా ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకు అది దక్కుతుంది కానీ ఇప్పుడు కుయ్యో మొర్రో అంటే ఏం లాభం .

English Title: reethu varma felt very sad for missing chance