రెజీనాను రేప్ చేసింది ఎవరు ?


Regina as rape Victim in Evaru
Regina as rape Victim in Evaru

రెజీనా పై అత్యాచారం జరగడంతో , ఆ రేప్ చేసింది ఎవరు ? ఎందుకు చేసారు ? అసలు రేప్ జరిగిందా ? హత్య కు గురయ్యింది ఎవరు ? తదితర అంశాల చుట్టూ కథ తిరగనుంది అదే ఎవరు ? చిత్రం . అడవి శేష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఎవరు చిత్రంలో హీరోయిన్ గా అత్యాచారానికి గురయ్యే అమ్మాయిగా నటించింది రెజీనా కాసాండ్రా . గతకొంత కాలంగా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్న ఈ భామకు ఎవరు తప్పకుండా ఆ లోటు పూడ్చేలా కనబడుతోంది .

ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లతో ఎవరు చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి . ఆగస్టు 15 న విడుదల అవుతున్న చిత్రాల్లో ఎవరు తప్పకుండా హిట్ కొడుతుందన్న పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది . ఇక అడవి శేష్ తో పాటుగా రెజీనా కూడా ఈ సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు . రేప్ కేసుపై మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఎవరు చిత్రాన్ని పివిపి నిర్మించగా రాంజీ దర్శకత్వం వహించాడు.