లెస్బియన్ గా హిట్ కొట్టిన రెజీనా


Rejina cassandra gets hit with lesbian

బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రాఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా ” చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది . ఈనెల 1 న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులు కూడా దక్కుతున్నాయి . ఎంట్రీ లోనే బాలీవుడ్ లో హిట్ కొట్టింది రెజీనా అయితే ఈ సినిమాలో లెస్బియన్ గా  నటించింది . అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనం కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనం – రెజీనా లు లెస్బియన్ గా నటించి పిచ్చెక్కించారు . ఇక అనిల్ కపూర్ కూడా కీలక పాత్ర పోషించాడు .

 

కాలం మారుతోంది , అలాగే అమ్మాయిల అభిప్రాయాలు అలాగే అబ్బాయిల అభిప్రాయాలు మారుతున్నాయి . అంతేకాదు శృంగారంలో రకరకాల వాంఛలు ఉండగా ఒక్కొక్కరు ఒక్కోలా ఇష్టపడుతున్నారు . ఆడ – మగ మధ్య శృంగారం అనేది ప్రక్రుతి సిద్దమైన అంశం అయితే అందుకు విరుద్దంగా మగవాళ్ల ని మగవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు . అలాగే ఆడవాళ్లు ఆడవాళ్ళతో శృంగారంలో పాల్గొనే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది . ఆ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది .

English Title: Regina cassandra gets hit with lesbian