రెజీనా లెస్బియన్ !


Regina cassandra as lesbian in Ak ladiki ko dekha to aisa laga
Regina cassandra

బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా తాజాగా బాలీవుడ్ చిత్రంలో నటించింది . అయితే ఆ చిత్రంలో రెజీనా లెస్బియన్ గా నటించినట్లు అర్ధం అవుతోంది . ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా అది వివాదాన్ని రాజేస్తోంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య అసహజ శృంగార చిత్రంగా రూపొందినట్లు తెలుస్తోంది . ఇందులో ఒక భామ రెజీనా కాగా మరో హాట్ భామ సోనం కపూర్ . అయితే ఈ చిత్రంలో రెజీనా పాత్ర కంటే సోనం కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది .

టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది రెజీనా కాసాండ్రా కానీ ఈ భామకు అనుకున్న స్థాయిలో పేరు ప్రఖ్యాతులు మాత్రం రాలేదు పాపం . ఎంతగా రెచ్చిపోయి అందాలను ఆరబోసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది దాంతో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోతోంది . తాజాగా లెస్బియన్ గా నటించి షాక్ ఇచ్చింది . సోనమ్ కపూర్ – రెజీనా ల మధ్య వచ్చే అసహజ శృంగార దృశ్యాలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి . ఫిబ్రవరి 1 న ” ఎక్ లడికికో దేఖాతో ఐసా లగా ” విడుదల కానుంది .

English Title: Regina cassandra as lesbian in ek ladiki ko dekha to aisa laga