సె *రాకెట్ గురించి రెజీనా ఏమందో తెలుసా


Regina Cassandra responds on Tollywood  Sx racketచికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే . అయితే ఆ రాకెట్ లో హీరోయిన్ రెజీనా పేరు కూడా బయటకు పొక్కడంతో పెద్ద రచ్చ రచ్చే అయ్యింది . కట్ చేస్తే ఇన్నాళ్లకు స్పందించింది రెజీనా కాసాండ్రా . టాలీవుడ్ సెక్స్ రాకెట్ లో నేను లేను , అయితే నా ప్రమేయం లేకుండానే నా పేరు ఉన్నట్లుగా కొంతమంది కథనాలు రాసారని …….. అలా బేస్ లేకుండా ఎలా రాస్తారని అయినా ఎవరో ఏదో రాసారని నేను వాటికి సమాధానం ఇవ్వాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రెజీనా .

అమెరికా వెళ్లినంత మాత్రాన , కిషన్ మోదుగుముడి లాంటి వాళ్ళని కలిసినంత మాత్రాన అలా ఎలా ఊహిస్తారని , మీరేమైనా చూసారా ? ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? అంటూ నిప్పులు కక్కుతోంది రెజీనా కాసాండ్రా . గత సంక్రాంతి సమయంలో అమెరికాలో జరిగిన ఈవెంట్ లో యాంకర్ లాస్య తో పాటుగా రెజీనా కూడా పాల్గొంది ఆ సమయంలో కిషన్ మోదుగుముడి తో దర్శనం ఇచ్చింది రెజీనా .

అయితే చికాగో సెక్స్ రాకెట్ లో మాత్రం నేను లేను , అవన్నీ తప్పుడు వార్తలు అంటూ ఆవేశం వెళ్లగక్కుతోంది . తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ అంతగా స్టార్ డం అందుకోలేకపోయింది . తాజాగా నటించిన తమిళ చిత్రం చంద్రమౌళి కూడా అంతగా ఆడటం లేదు అయితే ఈ భామ మాత్రం ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది .

English Title: Regina Cassandra responds on Tollywood S*x racket