రెజీనా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందా ?


Regina Cassandra
Rejina Cassandra Engagment
రెజీనా కాసాండ్రా ఎంగేజ్ మెంట్:
బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి . అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రెజీనా ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి . అయితే దీనికి సంబందించిన అధికారిక వార్త మాత్రం రాలేదు . రెజీనా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు , మలయాళ , హిందీ బాషలలో కూడా నటించింది .

అయితే ఎన్ని భాషల్లో నటించినా ఈ భామకు అదృష్టం మాత్రం దక్కడం లేదు పాపం . చేతిలో కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి అయినా మిగతా హీరోయిన్ ల లాగా ఈ భామకు అదృష్టం పట్టలేదు . దాంతో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది . ఈ భామ సందీప్ కిషన్ తో ప్రేమాయణం సాగించింది మొదట్లో కానీ ఆ ప్రేమ విఫలం అయ్యింది . ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ తో కూడా ప్రేమాయణం అంటూ కథనాలు వచ్చాయి కానీ లవ్ కాదు జస్ట్ ఫ్రెండ్స్ మీ మాత్రమే అని సెలవిచ్చారు ఇద్దరు కూడా .