టాలీవుడ్‌లో రీలీజ్ డేట్‌ల హంగామా!

టాలీవుడ్‌లో రీలీజ్ డేట్‌ల హంగామా!
టాలీవుడ్‌లో రీలీజ్ డేట్‌ల హంగామా!

టాలీవుడ్‌లో రిలీజ్ డేట్‌ల హంగామా మొద‌లైంది. గురువారం మూకుమ్మ‌డిగా నిర్మాణ సంస్థ‌ల‌న్నీ తాము నిర్మిస్తున్న చిత్రాల రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాయి. గ‌తంలో ఈ త‌ర‌హాలో లెక్క‌కు మించిన చిత్రాల రిలీజ్ డేట్ల‌ని ప్ర‌క‌టించి వుండ‌రు. ఆ స్థాయిలో గురువారం సినిమా రిలీజ్ డేట్‌ల‌ని మేక‌ర్స్ ఓ పండ‌గ‌లా ప్ర‌క‌టించేశారు.

గురువారం ఉద‌యం అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌` చిత్రంతో ఈ మూవీ రిలీజ్ డేట్‌ల ప‌రంప‌ర మొద‌లైంది. పుష్ప‌` ఆగ‌స్టు 13న విడుద‌ల‌వుతుండ‌గా, వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్న `గ‌ని` జూలై 30న విడుద‌ల కాబోతోంది. ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న `విరాట‌ప‌ర్వం` ఏప్రిల్ 30న వ‌చ్చేస్తోంది. ఇక గోపీచంద్ న‌టిస్తున్న `సీటీమార్‌` ఏప్రిల్ 2కు ఫిక్స్ అయిపోయింది.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న `ఎఫ్ 3` ఆగ‌స్టు 27న వ‌చ్చేస్తోంది. ఉన్న‌ట్టుండీ వ‌రుస‌గా మేక‌ర్స్ ఈ చిత్రాల రిలీజ్ డేట్‌ల‌ని ప్ర‌క‌టించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఫిబ్ర‌వ‌రి నుంచి కేంద్రం థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డ‌మే. దీంతో క‌లెక్ష‌న్స్ పెరిగ‌డం, థియేట‌ర్ల‌ని మునుప‌టి త‌ర‌హాలో  ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో రానుండ‌టంతో మేక‌ర్స్ త‌మ చిత్రాల రిలీజ్ డేట్‌ల‌ని గురువారం ప్ర‌క‌టించడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.