ఆ సినిమా వాయిదాపడుతోందట


release problem for rajnikanth kaalaతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” చిత్రాన్ని ఏప్రిల్ 27న భారీ ఎత్తున విడుదల చేయాలనీ అనుకున్నారు , దాంతో రజనీకాంత్ సినిమా వస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన మహేష్ బాబు తన సినిమా భరత్ అనే నేను చిత్రాన్ని వారం ముందుగా అంటే ఏప్రిల్ 20న విడుదల చేయడానికి సిద్దపడగా అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని మే 4న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు .

కట్ చేస్తే ఇప్పుడు అనుకున్న సమయానికి రజనీకాంత్ సినిమా వచ్చేలా లేదు ఎందుకంటే తమిళనాట డిజిటల్ ప్రొవైడర్ల ఇష్యూ తో తమిళనాట థియేటర్ లు బంద్ అయ్యాయి అందుకే రజనీ కాలా ఏప్రిల్ 27 న విడుదల కావడం లేదని అంటున్నారు అయితే ఇంకా ఆ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు . థియేటర్ ల సమస్య ఓ కొలిక్కి వస్తే సినిమా విడుదల అవుతుంది లేదంటే మేలో వస్తుంది రజనీ సినిమా .