రిలీజ్ సమస్యల్లో ఎన్టీఆర్ మహానాయకుడు


Release problems for NTR mahanayakudu

ఎన్టీఆర్ కథనాయకుడు డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ సమస్యలో చిక్కుకుంది . ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9 న విడుదల చేసారు అయితే టాక్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది సినిమా . దాంతో ఖంగుతిన్న బాలయ్య అండ్ కో ఎన్టీఆర్ మహానాయకుడు లో ఏమేమి మిస్ అయ్యాయో వాటిని మళ్ళీ రీ షూట్ చేసే పనిలో పడ్డారట అందుకే సినిమా విడుదల ఎప్పుడు అనేది తేలకుండా ఉంది.

అసలు జనవరిలోనే ఈ రెండో భాగం అనుకున్నారు కానీ ఫిబ్రవరికి మార్చారు . ఫిబ్రవరి 7 అనుకున్నది 14 కు మారింది . ఇక ఇప్పుడేమో ఎప్పుడు విడుదల అవుతుందో బాలయ్య కు క్రిష్ కు తప్ప మరొకరికి తెలియదు అలా ఉంది పరిస్థితి ఎన్టీఆర్ మహానాయకుడు సంగతి . సూపర్ హిట్ అవుతుందనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో , బయ్యర్లకు ఘోరమైన నష్టాలు రావడంతో ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ సమస్యల్లో పడింది.

 

English Title: Release problems for NTR mahanayakudu