బాల‌య్య కోసం `బంగారు బుల్లోడు` పాట‌!


బాల‌య్య కోసం `బంగారు బుల్లోడు` పాట‌!
బాల‌య్య కోసం `బంగారు బుల్లోడు` పాట‌!

బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `రూల‌ర్‌` ఫ్లాప్ త‌రువాత బాల‌కృష్ణ న‌టిస్తున్న సినిమా కావ‌డంలో ఈ సినిమాకు సంబంధించి బాల‌య్య ఏవిష‌యంలోనూ రాజీప‌డ‌టం లేద‌ట‌. మేక‌ప్‌, విగ్గుకు సంబంధించిన వాళ్ల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప‌క్క‌న పెట్టిన కొత్త టీమ్‌ని అపాయింట్ చేసినా బాల‌య్య జోక్యం చేసుకోలేద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.

క హిట్ కోసం భారీ జాగ్ర‌త్తలే తీసుకుంటున్నార‌ట‌. వార‌ణాసిలో అఘోరీల స్పాట్‌లో ఈ మూవీని మొద‌లుపెడుతున్న‌ట్టు తెలిసింది. ఇందులో బాల‌య్య అఘోరీగా, సాధార‌ణ పాత్రలో.. ఇలా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా అంజ‌లిని ఎంపిక చేశారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం బాల‌య్య హిట్ సాంగ్‌ని రీమిక్స్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

బాల‌య్య న‌టించిన `బంగారు బుల్లోడు` చిత్రంలోని `స్వాతిలో ముత్య‌మంత ముద్దులా సందె వానా..` అంటూ సాగే రెయిన్ సాంగ్‌ని ఈ సినిమా కోసం బాల‌కృష్ణ‌, అంజ‌లిపై రీమిక్స్ సాంగ్‌గా చిత్రీకరించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ పాట మాస్‌ని కిర్రెక్కించేలా వుంటుంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ పాట‌కు సంబ‌ధించిన వార్త‌ని త‌మ‌న్ షేర్ చేసే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.