సుమ ఛానల్ లో గెస్ట్ గా రేణు దేశాయ్


సుమ ఛానల్ లో గెస్ట్ గా రేణు దేశాయ్
సుమ ఛానల్ లో గెస్ట్ గా రేణు దేశాయ్

సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన ప్రత్యేకతను గత రెండు దశాబ్దాలకు పైగా నిరూపిస్తూనే ఉంది. కొత్త తరం యాంకర్లు వస్తున్నా కానీ సుమ తన ప్రత్యేకతను మాత్రం అలానే నిలుపుకుంటోంది. ఇప్పటికీ సుమ తెలుగు ఇండస్ట్రీలో బిజీ యాంకర్. ఎంత బిజీగా ఉన్నా కానీ సుమ తన ప్రోగ్రామ్స్ విషయంలో ఎక్కడా లేట్ చేయదు.

సుమ ఈ తరం కాంపిటీషన్ ను తట్టుకోవడానికి, అప్ టు డేట్ గా ఉండడానికి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన విషయం తెల్సిందే. సుమక్క పేరుతో ఉన్న ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే 600కె సబ్స్క్రయిబర్లను దాటుకుని దూసుకుపోతోంది.

సుమక్క ఛానల్ లో వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉండగా అందులో ఒకటి సెలెబ్రిటీలను తన ఇంటికి పిలిచి వారి ఫేవరెట్ డిష్ వండించడం. ఆ వంట జరుగుతున్న సమయంలో సుమ ఆసక్తికర ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు శ్రీముఖి, ప్రదీప్ వంటి టాప్ యాంకర్లు వచ్చారు. రీసెంట్ గా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సుమతో ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా రేణు దేశాయ్, సుమ ఇంటికి వచ్చింది. మరి చూడాలి ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతోందో.