రెండో పెళ్లి కి సిద్దమైన రేణు దేశాయ్


renu desai in love with new manపవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి కి సిద్ధమైంది . పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత గత నాలుగేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది రేణు దేశాయ్ . పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ తన ఏకాగ్రత ని సినిమాల మీదకు మళ్లించింది . రెండు సినిమాలు నిర్మించడమే కాకుండా ఒక చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా . అయితే ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు దానికి తోడూ భర్త లేక పోవడంతో కృంగిపోయిన రేణు దేశాయ్ అనారోగ్యానికి గురయ్యింది .

ఇక జీవితం అయిపోయిందేమో అని అనుకుంటున్న సమయంలో చావు వరకు వెళ్లి వచ్చింది దాంతో తన జీవితం ఇలా ముగియాల్సిన అవసరం లేదని , మగాళ్లు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్లు మాత్రం ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు అని తీవ్రంగా ఆలోచించిందట ! అప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది , పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ తగిన జోడీ ఎవరు ? తన జీవితానికి నమ్మకం కలిగించే వాళ్ళు ఎవరు ? అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో తగిన వ్యక్తి దొరికాడట ! ఇంకేముంది మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది . తనకు దొరికిన నేస్తం చేయి ని పట్టుకొని దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తోంది రేణు దేశాయ్ . అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లి పై కొంతమంది సపోర్ట్ చేస్తుండగా కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు .