రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లోకి


Renu desai re entry with bellamkonda sai srinivas

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతోందట , అది కూడా తెలుగు సినిమాలో . బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రేణు దేశాయ్ . మొదటి సినిమాలోనే పవన్ కళ్యాణ్ తో నటించడం వల్ల అతడితో సాన్నిహిత్యం ఏర్పడి పెళ్లి చేసుకుంది . కట్ చేస్తే పెళ్ళికి ముందే సినిమాలు మానేసింది అయితే పవన్ తో విడాకులు తీసుకోవడంతో పూణే వెళ్ళిపోయింది .

 

ఇక ఇప్పుడేమో కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో రేణు దేశాయ్ మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తోందట . మంచి పాత్ర లభిస్తే నటించడానికి సిద్ధం అవుతున్న ఈ భామ దర్శకురాలిగా కూడా ఓ చిత్రం చేసింది . అయితే అది అనుకున్న స్థాయిలో ఆడలేదు అందుకే మళ్ళీ నటన పై దృష్టి పెట్టినట్లుంది.