త‌ల్లి పాత్ర‌ల‌కైన రెడీ అంటున్నారు!


త‌ల్లి పాత్ర‌ల‌కైన రెడీ అంటున్నారు!
త‌ల్లి పాత్ర‌ల‌కైన రెడీ అంటున్నారు!

స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్‌ని రేణూదేశాయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు పిల్లలు అకీరా, ఆద్యా వున్నారు. అయితే ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన అభిప్రాయ బేధాల కార‌ణంగా ప‌వ‌న్‌తో రేణూదేశాయ్ విడిపోయారు. అప్ప‌టి నుంచి పిల్ల‌ల‌తో క‌లిసి పూనేలో త‌ల్లిదండ్రుల వ‌ద్ద వుంటున్నారామె.

ఆ త‌రువాత తెలుగులో రియాలిటీ గేమ్ షోల‌కు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు కూడా. మ‌రాఠీ చిత్రం `ఇష్క్ వాలా ల‌వ్‌`తో ద‌ర్శ‌కురాలిగా నిర్మాత‌గా మారిన రేణూదేశాయ్ మ‌ళ్లీ సినిమా ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. త్వ‌ర‌లో అకీరాను హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని, అందుకు స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే మ‌ళ్లీ సినిమాల్లో న‌టిస్తాన‌ని రేణు దేశాయ్ తాజాగా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న‌కు ప్రాధాన్య‌త‌నిచ్చే ఏ పాత్ర‌కైనా తాను సిద్ధ‌మ‌మేన‌ని చెబుతున్న ఆమె త‌ల్లి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి మాత్రం ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌భాస్‌, మ‌హేష్‌ల‌కు త‌ల్లిగా న‌టించ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.