కాబోయే భర్తతో రేణు దేశాయ్ రొమాన్స్


renu desai romantic mood with her fiance

తనకు కాబోయే భర్త తో రొమాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజిచ్చి వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ వల్ల వెయ్యి ముక్కలైన నా హృదయాన్ని నా జతగాడు ఒక్కొక్కటిగా ఆ వెయ్యి ముక్కలను మళ్ళీ ఒక్కటిగా చేర్చాడు అంటూ కితాబు నిచ్చింది కూడా . ఓ పార్క్ లో తనకు కాబోయే వాడితో కలిసి దిగిన ఫోటో లో రేణు దేశాయ్ ముఖం చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అర్ధం అవుతోంది , రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఆ ఫోటో చూసి కొంతమంది ఆగ్రహంతో ఊగిపోతున్నారు .

పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత పూణే లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న రేణు అనారోగ్య బారిన పడిన సమయంలో తనకు ఓ తోడు ఉంటే బాగుంతుంది అని భావించిన రేణు ఎట్టకేలకు తన మనసుకి నచ్చినవాడు దొరకడంతో ఆరేళ్ళ తర్వాత రెండో పెళ్లి కి సిద్ధమైంది . రెండో పెళ్లి కి సిద్దమైన రేణు దేశాయ్ తనకు కాబోయే భర్త ని మాత్రం రివీల్ చేయడం లేదు ఎందుకో . ఇక తన పెళ్ళికి పిల్లల అనుమతి కూడా తీసుకున్నానని చెబుతున్న రేణు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది .