రేణు మనసుని పవన్ వెయ్యి ముక్కలు చేసాడట


renu desai sensational comments on pawan kalyanనా మనసు వెయ్యి ముక్కలైంది , అయితే ఆ వెయ్యి ముక్కలను ఒక్కొక్కటిగా కూర్చుతూ నా మనసు ని మళ్ళీ ఒక్కటిగా చేసిన వ్యక్తి నా కాబోయే భర్త అంటూ సోషల్ మీడియాలో పెట్టేసి పవన్ కళ్యాణ్ పై పెద్ద నిందే వేసింది మాజీ భార్య రేణు దేశాయ్ . దాదాపుగా ఏడేళ్లుగా రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత పూణే లో ఉంటోంది రేణు దేశాయ్ . అయితే ఇన్నాళ్లు ఒంటరిగానే ఉంది కానీ తనకు కూడా ఓ తోడు కావాలని ఆశపడిందట దాంతో తన మనసుకి నచ్చిన వాడితో రెండో పెళ్ళికి సిద్దమయిపోయింది రేణు దేశాయ్ .

అయితే తనకు కాబోయే భర్త ని మాత్రం చూపించడం లేదు , వివరాలను కూడా ఇవ్వడం లేదు . పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నాక రేణు దేశాయ్ హృదయం వెయ్యి ముక్కలైందట . ఇదేనా జీవితం అంటూ నిర్వేదానికి లొనయ్యిందట అయితే అలా ముక్కలైన హృదయాన్ని మళ్ళీ ఒకటిగా చేసి స్వాంతన చేకూర్చాడట రేణు దేశాయ్ కి కాబోయే భర్త దాంతో అతడి పై ప్రేమానురాగాలను కురిపిస్తోంది . తాజాగా తనకు కాబోయే భర్త తో కలిసి దిగిన ఫోటో ని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్ , అయితే అతడి ఫోటో కనిపించకుండా జాగ్రత్తపడింది రేణు దేశాయ్ . పవన్ కళ్యాణ్ వల్ల రేణు మనసు వెయ్యి ముక్కలైంది అని అర్ధం వచ్చేలా కామెంట్ చేసి మళ్ళీ కొత్త రచ్చ కు తెరలేపింది .

English Title: renu desai sensational comments on pawan kalyan