తప్పు పవన్ కళ్యాణ్ దే అంటున్న రేణు దేశాయ్


renu desai sensational comments on pawan kalyan

విడాకుల విషయంలో తప్పు పవన్ కళ్యాణ్ దే అని స్పష్టం చేసి సంచలనం సృష్టించింది మాజీ భార్య రేణు దేశాయ్ . ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ……. …. రేణు దేశాయ్ తాజాగా మరొక ఇంటికి కోడలు అవుతున్న తరుణంలో ఈ విషయాన్నీ తెలియజేయడానికి యు ట్యూబ్ ముందుకు వచ్చింది . విడాకులు కావాలని పట్టుపట్టింది నేను కాదని , పవన్ కళ్యాణ్ అని అతడు అంతగా కోరుకుంటే కాదనలేక ఇచ్చానని అందులో నా తప్పు అస్సలు లేదని అంటోంది అంటే ……. తప్పంతా పవన్ కళ్యాణ్ దే అని చెప్పినట్లేగా .

అయితే రేణు దేశాయ్ చెప్పినవి కొన్నే అయితే తాజాగా సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువచేసి చూపిస్తున్నారు . పవన్ కళ్యాణ్ బోలెడు మందితో తిరిగాడని , ఇప్పుడేమో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నేను రెండో పెళ్లి చేసుకుంటే తప్పా ? అని పవన్ ని నిలదీసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ పై మొదటి నుండి వ్యతిరేకత చూపించలేదు , కానీ ఇటీవల మాత్రం ఆమె స్వరంలో మార్పు వచ్చింది . పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం లేదు కానీ పవన్ తప్పు ఉందని మాత్రం చెప్పకనే చెబుతోంది .

రేణు దేశాయ్ తాజాగా రెండో వివాహానికి సిద్ధం అయ్యింది , ఆ పెళ్ళికి తన ఇద్దరు పిల్లలు అకిరా నందన్ , ఆద్య ల అనుమతి ఉందని కూడా అంటోంది.