రేణు దేశాయ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుందట


renu desai set for tollywoodబద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యింది కట్ చేస్తే పవన్ తో విడాకులు తీసుకొని పూణే లో ఉంటున్న రేణు ఇప్పుడు తెలుగు సినిమాల్లో మళ్ళీ నటించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది . విడాకులు తీసుకొని పూణే వెళ్లిన రేణు దేశాయ్ దర్శకురాలిగా నిర్మాతగా మారి సినిమాలను రూపొందించింది . అయితే ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు కానీ రేణు దేశాయ్ మాత్రం సినిమాలపై మనసు చంపుకోలేక పోయింది . అందుకే మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉత్సాహపడుతోందట .

అయితే ఇప్పుడే కాదు మొదట రెండో పెళ్లి చేసుకొని కొంతకాలం కొత్త వైవాహిక జీవితాన్ని ఆస్వాదించి ఆపై సినిమాలపై దృష్టి పెట్టాలని భావిస్తోందట . తనకు తగ్గ మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంటోందట రేణు దేశాయ్ . ఇక ఈమెకు ఇద్దరి సంతానం కాగా అకిరా నందన్ కు 14 ఏళ్ళు కాగా ఆద్య కు 8 సంవత్సరాలు . ఇక ఇప్పుడేమో రెండో పెళ్లి కి సిద్ధం అవుతోంది అయితే తనకు కాబోయే భర్త ని మాత్రం పరిచయం లేదు రేణు దేశాయ్ .

English Title: renu desai set for tollywood