పవన్ ఫ్యాన్స్ కు చురకలంటించిన రేణు దేశాయ్


Renu desai setires on pawan kalyan fans
Renu desai

పవన్ కళ్యాణ్ పై నాకు కోపం లేదు కానీ బాధగా ఉందని అంటోంది మాజీ భార్య రేణు దేశాయ్ . ఈమధ్య రేణు దేశాయ్ కొన్ని కవితలను రాసింది కాగా వాటిని సంకలనం గా మార్చింది . అయితే నేను రాసిన కవితలలో పవన్ కళ్యాణ్ ని ఊహించుకోవద్దని పవన్ కళ్యాణ్ అభిమానులకు చురకలు అంటించింది . నేను ఏం మాట్లాడినా , ఏం రాసిన అందులో పవన్ కళ్యాణ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు , అందరూ అక్కడే ఆగిపోయారు . నేను పవన్ నుండి విడిపోయి చాలా రోజులయ్యింది నాకంటూ కొత్త జీవితం ఉంది అది వేరు అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అంటూ సెటైర్ వేసింది రేణు దేశాయ్ .

నిజమే రేణు దేశాయ్ ఏ ట్వీట్ చేసినా పవన్ కళ్యాణ్ గురించే ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . దాంతో రేణు దేశాయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది . ఇక 2019 లో పెళ్లి చేసుకోబోతున్నానని , నాకు కాబోయే వాడు ఇప్పటికే నా పిల్లలతో చాలా కలిసి పోయాడని …… వాళ్ళని బాగా చూసుకుంటున్నాడని అంటోంది . అంతేనా 2019 లో మరో సినిమా చేయబోతున్నానని అంటోంది రేణు దేశాయ్ .

English Title: Renu desai setires on pawan kalyan fans