సుకుమార్ స్క్రిప్ట్ కు మళ్ళీ మరమత్తులు మొదలయ్యాయా?

Repairs again for Allu Arjun Sukumar project
Repairs again for Allu Arjun Sukumar project

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరం చూసాం. బన్నీ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా కేవలం ఆరు రోజుల్లోనే నిలిచిన ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఆదివారం వరకూ కలెక్షన్స్ కు ఢోకా లేదు. అయితే సోమవారం నుండి ఈ సినిమా కలెక్షన్స్ బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది. అల వైకుంఠపురములో టీమ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకుల కోసం భారీ ప్లాన్స్ వేశారు. రేపు వైజాగ్, 24న తిరుపతిలో రెండు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అలాగే కర్ణాటక, కేరళ కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు బన్నీ నటన తోడై ఈ సినిమా రేంజ్ మారిపోయింది. నిజానికి బన్నీ నటించిన క్లాస్ సినిమాలన్నీ హిట్టయ్యాయి. మరోవైపు బన్నీ మాస్ క్యారెక్టర్ లు ప్రయత్నించినప్పుడు హిట్ల శాతం బాగా తగ్గుతుంది. ఏదో దేశముదురు, సరైనోడు లాంటి ఒకట్రెండు మాస్ సినిమాలు హిట్టయ్యాయి.

2018లో వచ్చిన నా పేరు సూర్య ఫలితం బన్నీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇక అల వైకుంఠపురములో చిత్రం తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా కూడా ఊర మాస్ కథ. శేషాచలం అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్నీ రఫ్ అండ్ రా లుక్ లోకి మారిపోనున్నాడు. చిత్రంలో కూడా లారీ డ్రైవర్ గా నటిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. పక్కా క్లాస్ సినిమా చేసిన తర్వాత ఇంత ఊర నాటు సినిమా చేయడం కరెక్టేనా అన్న ఆలోచనలు జరుగుతున్నాయట. సుకుమార్ స్క్రిప్ట్ మరీ రా గా కాకుండా కొంచెం టోన్ డౌన్ చేసి పోలిష్ పెడితే ఎలా ఉంటుందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.