`రిప‌బ్లిక్‌` నా కెరీర్‌లో వెరీ స్పెష‌ల్ ఫిల్మ్‌: సాయితేజ్

 

Republic going to be a special movie in my career - sai tej
Republic going to be a special movie in my career – sai tej

సాయితేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `రిప‌బ్లిక్‌`. దేవా క‌ట్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జెబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె. పుల్లారావు. జె. భ‌గ‌వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో ఓ సెటైరిక‌ల్ ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. ఇదిలా వుంటే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేశారు. కేవ‌లం 64 రోజుల్లో టోట‌ల్ షూటింగ్‌ని పూర్తి చేశాం. అదృష్టం ఏంటంటే ఈ టీమ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ఎలాంటి కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. అని ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా ఎంటైర్ టీమ్ వున్న ఫొటోని షేర్ చేస్తూ ప్ర‌క‌టించారు.

హీరో సాయితేజ్ కూడా షూటింగ్ పూర్త‌యింద‌ని త‌న‌దైన స్టైల్లో స్పందించాడు. `4 నెలల హార్డ్ వ‌ర్క్..  ఫోకస్ వ‌ల్ల‌ మేము షూట్ పూర్తి చేసాము.కెమెరా వెనుక మరియు కెమెరా ముందు వున్న అంద‌రి కృషి వ‌ల్లే ఇది సాధ్యం అయింది.  #REPUBLIC నా కెరీర్‌లో ఒక ప్రత్యేక చిత్రం కానుంది` అని ట్వీట్ చేశారు.